: ఎదురిచ్చినా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే నాయకుడుంటారా? : బీజేపీ నేత రఘునాధబాబు


ఎదురిచ్చి తెచ్చుకున్నా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే నాయకుడు ఉంటారా? అని ఏపీ బీజేపీ సీనియర్ నేత రఘునాధబాబు ప్రశ్నించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కొణతాల బీజేపీలో చేరనున్నారా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన జాతీయ పార్టీలోకి వెళ్తానని అన్నారు. అంటే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా? అని అడిగారు. బీజేపీ ఏపీలో నిలదొక్కుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ పార్టీ అని, భవిష్యత్ పై నమ్మకంతో బీజేపీలో నేతలు చేరే అవకాశం ఉందని ఆయన వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఓసారి మూడవ స్థానానికి వెళితే, తిరిగి అది కోలుకునే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు. ఇది గతంలో చాలా రాష్ట్రాల్లో రుజువైందని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News