: ఏపీలో కాంగ్రెస్ అంతర్థానమవుతుంది... బీజేపీలో చేరేందుకు కాంగీయుల ఆసక్తి: మంత్రి మాణిక్యాలరావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతర్ధానమవుతుందని మంత్రి మాణిక్యాలరావు జోస్యం చెప్పారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నేతలంతా బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. కన్నా లక్ష్మీనారాయణతో పాటు మరింత మంది కాంగ్రెస్ నేతలు వలస బాటపడతారని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఉండే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ ఏపీకి ఏం చేసిందో అందరికీ తెలుసని, అందుకే ఆ పార్టీని రాష్ట్రం నుంచి బహిష్కరించనున్నారని ఆయన తెలిపారు.