: రేపటిలోగా నల్లధనం ఖాతాదారుల పేర్లు ఇస్తాం: అరుణ్ జైట్లీ
రేపటిలోగా నల్లధనం ఖాతాదారుల పేర్లు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. పేర్లు వెల్లడించడానికి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. "సుప్రీం ఏర్పాటు చేసిన సిట్ కు ఖాతాదారుల పేర్లు ఇస్తాం. ఈ కేసులో దర్యాప్తు చేయడానికి ప్రభుత్వానికి ఎవరితోనూ ఎలాంటి వివాదం లేదు" అని జైట్లీ చెప్పారు.