: అల్లు అర్జున్, గోపిచంద్ లను ఆహ్వానించిన సానియా మీర్జా
భారత టెన్నిస్ సూపర్ స్టార్ సానియా మీర్జా టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్, గోపీచంద్ లను ఆహ్వానించింది. ఇంటికనుకుంటున్నారా? అయితే, తప్పులో కాలేసినట్టే! ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమం దేశానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పిన ఆమె, తాను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, గోపీచంద్ లను 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నట్టు తెలిపింది. సానియా ఆహ్వానాన్ని అల్లు అర్జున్, గోపీచంద్ మన్నిస్తారో, లేదో చూడాలి మరి!