: మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవిస్ ఎన్నిక
మహారాష్ట్ర సస్పెన్స్ విడిపోయింది. 'మహా' ముఖ్యమంత్రి ఎవరన్నది తేలిపోయింది. మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవిస్ ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. దాంతో, ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఆయనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో, ఈ సాయంత్రం బీజేపీ ఎమ్మెల్యేలు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావును కలవనున్నారు. సీఎం అభ్యర్థి పేరును ఆయనకు తెలపనున్నారు. అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ వారిని కోరతారు. తాజా ఎన్నికల్లో 122 స్థానాలు గెలుచుకున్న బీజేపీకి, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయిన మద్దతును శివసేన ఇవ్వనుంది.