: నల్ల కుబేరులందరి పేర్లను వెల్లడించాల్సిందే: కేజ్రీవాల్
అక్రమ సంపాదనను స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న నల్ల కుబేరులందరి పేర్లను వెల్లడించాల్సిందేనని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. విడతలవారీగా ఎంపిక చేసిన పేర్లను మాత్రమే వెల్లడించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంగళవారం ఆయన ఆరోపించారు. అసలు ముగ్గురి పేర్లను మాత్రమే ఎలా వెల్లడిస్తారంటూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. అక్రమార్కులందరి పేర్లను వెల్లడించడంతో పాటు దోషులుగా తేలిన వారిపై నిర్ణీత సమయంలోగా శిక్షలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.