: ఢిల్లీలో ఎన్నికలు జరిగితే బీజేపీకే ఆధిక్యం: వెంకయ్యనాయుడు
ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీని లెఫ్టినెంట్ గవర్నర్ ఆహ్వానించనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. ఢిల్లీలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా బీజేపీ సంసిద్ధంగా ఉందన్నారు. అక్కడ ఎన్నికలు నిర్వహిస్తే తమ పార్టీ పూర్తి మెజారిటీ సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.