: ఛాప్రౌలా పారిశ్రామిక వాడపై కఠిన చర్యలు: ఉమా భారతి
గ్రేటర్ నోయిడాలోని ఐదు గ్రామాల ప్రజలను కేన్సర్ బారిన పడేసిన ఛాప్రౌలా పారిశ్రామిక వాడపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతి ప్రకటించారు. పారిశ్రామిక వాడ వెదజల్లుతున్న కాలుష్యాల కారణంగా గ్రేటర్ నోయిడా పరిధిలోని సదోపూర్, అచ్చేజీ, సాదుల్లాపూర్, బిష్నులి, ఖేరా ధర్మపురాల్లో గడచిన ఐదేళ్లలో 70 మంది చనిపోగా, మరో 90 మంది కేన్సర్ బారిన పడ్డారని సోమవారం ప్రచురితమైన వార్తలపై దృష్టి సారించిన ఉమా భారతి, ఈ విషయంపై సమగ్ర విచారణ చేయిస్తామని మంగళవారం వెల్లడించారు. విచారణ నివేదిక ఆధారంగా పారిశ్రామిక వాడపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.