: జూడాలు సామాజిక బాధ్యతతో మెలగాలి: కర్నె ప్రభాకర్
గత 28 రోజులుగా జూడాలు సమ్మె చేయడాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తప్పుబట్టారు. జూడాల చర్యలు బాధాకరమని చెప్పారు. గ్రామీణ ప్రజానీకం అనేక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని... వారికి సేవలందించడం జూడాల బాధ్యత అని హితవు పలికారు. బోధనాసుపత్రుల్లో సమ్మెలు చేయడాన్ని నిషేధిస్తూ 2013లోనే జీవో వచ్చిందని చెప్పారు. సామాజిక బాధ్యతతో జూడాలు మెలగాలని సూచించారు.