: ఫేస్ బుక్ లో చెత్త కామెంట్ చేసిన వ్యక్తి జైలుపాలు... లైక్ చేసిన వారిపై కేసులు!
సోషల్ మీడియాలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాకాకుండా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే కుదరదు. అలా అనుచితంగా ప్రవర్తించి ఓ వ్యక్తి జైలుపాలవగా, అతను ఫేస్ బుక్ లో చేసిన కామెంట్ ను లైక్ చేసినవారు చిక్కుల్లో పడ్డారు. వారిపై కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. వివరాల్లోకెళితే... ఆళ్ళగడ్డకు చెందిన రమణ అనే వ్యక్తి హుదూద్ తుపానుకు సంబంధించి ఫేస్ బుక్ లో ఓ కామెంట్ చేశాడు. ఫలానా వ్యక్తిని గెలిపించనందునే విశాఖకు శాపం తగిలిందని, తుపాను సంభవించిందని పేర్కొన్నాడు. దానిని ఓ 50 మంది వరకు లైక్, షేర్ చేశారు. కామెంట్ పెట్టిన రమణను అరెస్టు చేసిన పోలీసులు, దాన్ని లైక్ చేసిన, షేర్ చేసిన వ్యక్తుల ఆచూకీ తెలుసుకునే పనిలో పడ్డారు.