: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు జాప్యంపై సుప్రీం సీరియస్
దేశ రాజధాని ఢిల్లీ ఎనిమిది నెలల నుంచీ ప్రభుత్వం లేకుండా రాష్ట్రపతి పాలనలో కొనసాగడంపై తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యంలో రాష్ట్రపతి పాలన శాశ్వతంగా ఉండకూడదని పేర్కొంది. ఢిల్లీలో అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను కోరారు. ఆ వెంటనే ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ సందర్భంగా సీరియస్ గా స్పందించిన న్యాయస్థానం పైవిధంగా చివాట్లు పెట్టింది. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి లెఫ్టినెంట్ గవర్నర్ ఎక్కువ సమయం తీసుకోకూడదని చెప్పింది.