: 'లవ్ జిహాద్', 'ఆనర్ కిల్లింగ్' రెండూ ఒకటే!: అమీర్ ఖాన్
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపిన 'లవ్ జిహాద్' పదంపై తాజాగా బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తనదైన శైలిలో మాట్లాడాడు. లవ్ జిహాద్ ను ఆనర్ కిల్లింగ్ (పరువు హత్య)తో పోల్చాడు. ఇటీవల భోపాల్ వెళ్లిన అమీర్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ సమయంలో మాట్లాడుతూ, లవ్ జిహాద్ ఆనర్ కిల్లింగ్ లాంటిదేనని అభిప్రాయపడ్డాడు. రెండింటిని ఒక పరిస్థితిలోనే ఉపయోగిస్తారని, ఇష్టమైన భాగస్వామిని ఎంచుకునే హక్కును లాక్కోవడమేనని పేర్కొన్నాడు. బలవంతంగా మతమార్పిడి చేయడం చాలా అన్యాయమని అమీర్ వివరించాడు. కొన్ని రోజుల కిందట 'లవ్ జిహాద్'పై నటుడు సైఫ్ అలీఖాన్ ఏకంగా ఓ పత్రికకు ప్రత్యేక కాలం రాసిన సంగతి తెలిసిందే.