: సర్దార్ వల్లభాయ్ విగ్రహ నిర్మాణ కాంట్రాక్టు ఎల్ అండ్ టి వశం


ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సర్దార్ వల్లభాయ్ విగ్రహ నిర్మాణ కాంట్రాక్టు ఎల్ అండ్ టి సంస్థ వశమైంది. ఈ మేరకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' పేరిట నర్మదా డ్యాం వద్ద చేపడుతున్న ఈ విగ్రహ నిర్మాణానికి మొత్తం రూ. 2979 కోట్లు ఖర్చు చేయనున్నారు. దీని ఎత్తు 182 మీటర్లు. ప్రపంచంలో ఇదే అత్యంత ఎత్తైన విగ్రహం కానుంది. గాంధీనగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో గుజరాత్ సీఎం ఆనంది బెన్ పటేల్ ఎల్ అండ్ టి సంస్థకు వర్క్ ఆర్డర్ పత్రాలు అందించారు. నాలుగేళ్ళలో ఈ నిర్మాణం పూర్తవుతుందని ఆమె తెలిపారు. నిర్మాణ కాంట్రాక్టును దేశంలోనే అగ్రగామి కన్ స్ట్రక్షన్ సంస్థ లార్సన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టి)కి అప్పగించామని పేర్కొన్నారు. ప్రధాన విగ్రహానికి రూ.1347 కోట్లు ఖర్చు చేస్తామని, రూ.235 కోట్లతో ఎగ్జిబిషన్ హాల్ నిర్మాణం చేపడతామని, రూ.83 కోట్లతో డ్యాం మధ్యలోని విగ్రహం నుంచి వెలుపలికి వంతెన నిర్మిస్తామని వెల్లడించారు. మరో రూ.657 కోట్లను 15 ఏళ్ళ వరకు ఈ విగ్రహ ప్రాజెక్టు నిర్వహణకు వినియోగిస్తామని ఆనంది బెన్ వివరించారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా చైనాలోని స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ (128 మీటర్లు) విగ్రహం ఖ్యాతి పొందింది.

  • Loading...

More Telugu News