: ఉద్యమ భాష వదిలిపెట్టు... సీఎం స్థాయిలో వ్యవహరించు: మంత్రి ప్రత్తిపాటి ఫైర్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్థాయికి తగ్గట్టు ప్రవర్తించడం లేదని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. ఉద్యమ భాషను వదిలి... సీఎం స్థాయికి తగ్గట్టు వ్యవహరించాలని సూచించారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి... పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిపై దిగజారి మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు హయాంలో డిప్యూటీ స్పీకర్ గా, మంత్రిగా పనిచేసిన సంగతి మరచిపోయావా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ కష్టాల్లో ఉందని... శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసినా, 300 మెగావాట్ల విద్యుత్ ఇస్తామని ఏపీ ప్రభుత్వం చెబితే, సంతోషించాల్సింది పోయి అవాకులు, చవాకులు పేలుతావా? అంటూ మండిపడ్డారు. కుట్ర రాజకీయాలు మాని, ప్రజా శ్రేయస్సుపై దృష్టి సారించాలని కేసీఆర్ కు సూచించారు.

  • Loading...

More Telugu News