: తోటపల్లి గాంధీ అంత్యక్రియలకు హాజరవనున్న కేసీఆర్
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు బోయినపల్లి వెంకటరామారావు (95) అనారోగ్యంతో నిన్న (సోమవారం) తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా హైదరాబాదులోని దక్కన్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొన్న ఆయన... తోటపల్లి గాంధీగా పేరుగాంచారు. వెంకటరామారావు మృతి పట్ల టీఎస్ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ రోజు కరీంనగర్ లోని ఎల్ఎండీ తీరంలో అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు కేసీఆర్ హాజరవుతున్నారు.