: ఐపీఎల్ బెట్టింగ్ కేసులో ధోనీని పోలీసులు ప్రశ్నించారా?


గతేడాది కలకలం సృష్టించిన ఐపీఎల్ బెట్టింగ్ కేసులో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని పోలీసులు ప్రశ్నించారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల వెస్టిండిస్ తో జరిగిన రెండో వన్డే సందర్భంగా ఢిల్లీ వచ్చిన ధోనీని పోలీసులు విచారించారని తెలుస్తోంది. బెట్టింగ్ పై విచారణకు సుప్రీంకోర్టు నియమించిన ముకుల్ ముద్గల్ కమిటీ అభ్యర్థన మేరకు ఢిల్లీ పోలీసులు 13 మంది కీలక వ్యక్తులను విచారించారు. వీరిలో ధోనీతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ సురేశ్ రైనా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 13 మందిని విచారించిన పోలీసులు, తమ నివేదికను సోమవారం కమిటీకి అందించారు. తన విచారణకు పోలీసుల విచారణను జోడించి ముద్గల్ కమిటీ తుది నివేదిక రూపొందిస్తోంది. నవంబర్ 3న ఈ తుది నివేదికను కమిటీ సుప్రీంకోర్టుకు సమర్పించనుంది.

  • Loading...

More Telugu News