: సన్ రైజర్స్ 'టాప్' లేచింది
ఐపీఎల్ తాజా సీజన్ లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తోన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నేటి మ్యాచ్ లో కష్టాల్లో పడింది. పుణే సహారా స్టేడియంలో వారియర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. అయితే, పుణే వారియర్స్ బౌలర్ భువనేశ్వర్ (3/18) సూపర్ స్పెల్ కు హైదరాబాద్ టాపార్డర్ దాసోహమైంది. కాగా, మిడిలార్డర్లో సామంత్ (37), లోయరార్డర్లో అమిత్ మిశ్రా (30), ఆశిష్ రెడ్డి (19 నాటౌట్) రాణించడంతో సన్ రైజర్స్ 8 వికెట్లకు 119 పరుగులు చేసింది.