: కన్నడ కంఠీరవ విగ్రహావిష్కరణకు అమితాబ్, రజనీకాంత్, చిరంజీవి
నవంబర్ 29న బెంగళూరులో జరగనున్న కన్నడ కంఠీరవ దివంగత డాక్టర్ రాజ్ కుమార్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. కన్నడ నాట దిగ్గజనటుడిగా పేరొందిన రాజ్ కుమార్ అనితర సాధ్యమైన నటనతో అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బహుభాషా నటుడు కమలహాసన్, మెగాస్టార్ చిరంజీవి, మలయాళ సూపర్ స్టార్ లు మమ్మూట్టి, మోహన్ లాల్, బి సరోజాదేవిలను ఆహ్వానించినట్టు కర్ణాటక రాష్ట్ర సమాచార శాఖ మంత్రి రోషన్ బేగ్ తెలిపారు.