: తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని చెప్పడమే బాబు లక్ష్యం: కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని చెప్పడమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి లక్ష్యమని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని అన్నారు. నదీ జలాల కేటాయింపులు, వినియోగంలో అన్యాయం జరిగిందని ఆయన కృష్ణా బోర్డు ఛైర్మన్ కు తెలిపారు. సాగర్ నుంచి పోతిరెడ్డిపాడు వరకు అన్యాయం జరిగిందని ఆయన చెప్పారు. నీరు, విద్యుత్ విషయంలో ఏపీ ప్రభుత్వం విభజన చట్టాలను ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. కృష్ణపట్నంలో తమ జెన్ కో, డిస్కం 1050 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాయని ఆయన ఆరోపించారు.