: జంక్ ఫుడ్ తినడానికి ఫేస్ బుక్ కూడా కారణమే
జంక్ ఫుడ్ తినడానికి ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా కూడా ఓ కారణమని ఆస్ట్రేలియాలోని సిడ్నీలో చేపట్టిన ఓ సర్వే వెల్లడించింది. బాలబాలికలు పిజ్జా, బర్గర్లను తినేందుకు అత్యంత ఆసక్తి చూపడం వెనుక కారణం సోషల్ మీడియానే అని ఆ సర్వే స్పష్టం చేసింది. సోషల్ మీడియాలోని సైట్లలో జంక్ ఫుడ్స్ కు సంబంధించిన మార్కెటింగ్ ఎక్కువగా ఉందని, దీంతో పిల్లలు వీటిపై అమితాసక్తి చూపుతున్నారని సర్వే వివరించింది. అలాగే టీనేజ్ పిల్లలు ఫేస్ బుక్ పేజీలను ఎక్కువగా లైక్ చేస్తున్నారని సర్వే వెల్లడించింది.