: నా ఆస్తుల్లో ఎలాంటి ఆకస్మిక పెరుగుదల లేదు: సదానంద గౌడ
కేంద్ర కేబినెట్ లో చేరిన తరువాత తన ఆస్తులు రూ.పది కోట్లకు పెరిగాయంటూ వస్తున్న ఆరోపణలను రైల్వే మంత్రి సదానంద గౌడ ఖండించారు. తన ఆస్తుల్లో ఎటువంటి ఆకస్మిక పెరుగుదల లేదని, ఓ అంకితమైన రాజకీయవేత్తగా ప్రజల డబ్బును ఎక్కడా దుర్వినియోగం చేయలేదని చెప్పారు. గౌడ ఆస్తుల నికర విలువ మేలో రూ.9.88 కోట్ల నుంచి ఈ అక్టోబర్ కు రూ.20.35 కోట్లకు పెరిగాయని ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యు) కలసి రూపొందించిన ఓ నివేదికలో వెల్లడించాయి. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్ర మంత్రి పైవిధంగా స్పందించారు.