: తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సాయంపై ఉత్తర్వులు
తెలంగాణ ఉద్యమ సమయంలో చనిపోయిన అమరవీరుల కుటుంబాలకు చేయనున్న ఆర్థికసాయంపై రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల్లో కలెక్టర్లు గుర్తించిన 459 కుటుంబాలకు సాయం అందించాలని అందులో పేర్కొంది. ఈ నేపథ్యంలో అవసరమయిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. ఇందుకోసం ప్రభుత్వం కొన్ని రోజుల కిందట రూ.45.90 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.