: రైతులకు 8 గంటల విద్యుత్ ఇవ్వాలి: మహబూబ్ నగర్ ధర్నాలో టీ కాంగ్ నేతలు


తెలంగాణ రైతాంగానికి ఎనిమిది గంటల పాటు విద్యుత్ ను సరఫరా చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యుత్ ఇక్కట్లను రూపుమాపాలని డిమాండ్ చేస్తూ జిల్లాల్లో నిరసనలు చేపట్టాలని టీ-కాంగ్రెస్ నేతలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నేడు మహబూబ్ నగర్ లోని విద్యుత్ శాఖ కార్యాలయం ముందు వారు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ పొన్నాల, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, నేతలు షబ్బీర్ అలీ, జానారెడ్డి, డీకే అరుణ, నంది ఎల్లయ్య తదితరులు హాజరయ్యారు. రైతులకు అందించే విద్యుత్ ను అంతరాయాలు లేకుండా సరఫరా చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News