: ఆ పారిశ్రామికవాడ ఐదు గ్రామాలను తుడిచిపెట్టేస్తోంది!


దేశ రాజధాని ఢిల్లీకి ఆ గ్రామాలన్నీ కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. 20 ఏళ్ల క్రితం దాకా ఆ గ్రామాలన్నీ సకల సౌకర్యాలు, సదుపాయాలకు నిలయంగా విలసిల్లాయి. తియ్యటి తాగు నీటికి నాడు ఆ గ్రామాల్లో కొదవన్నదే లేదు. ఆ నీరు తాగి రోగాల బారిన పడిన గ్రామస్థుడే లేడు. అయితే 20 ఏళ్ల నాడు అక్కడ వెలసిన ఓ పారిశ్రామికవాడ ఆ గ్రామాలను క్రమంగా తుడిచిపెట్టేస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా పరిధిలోని ఛాప్రౌలా ఇండస్ట్రియల్ ఎస్టేట్ కథ ఇది. సదరు ఎస్టేట్ పరిసరాల్లోని ఐదు గ్రామాలు సదోపూర్, అచ్చేజా, సాదుల్లాపూర్, బిష్నులి, ఖేరా ధర్మపురాల ధీన గాథ కూడా ఇదే. పారిశ్రామికవాడలోని దాదాపు వంద దాకా పరిశ్రమల నుంచి వెల్లువెత్తుతున్న కాలుష్యంతో ఈ గ్రామాల్లోని భూగర్భ నీరు కలుషితమైంది. తాగేందుకు ఏమాత్రం వీలు కాని స్థాయికి చేరింది. అంతేకాదు, ఆ గ్రామాల ప్రజలను వ్యాధుల బారిన పడేసింది. ఇప్పటికే ఆ కాలుష్యాల కారణంగా కేన్సర్ సోకి ఐదు గ్రామాలకు చెందిన 70 మంది చనిపోగా, 90 మంది కేన్సర్ తో జీవన పోరాటం చేస్తున్నారు. మరో 60 మంది దాకా వివిధ రకాల వ్యాధులతో సతమతమవుతున్నారు.

  • Loading...

More Telugu News