: కారు రేసింగ్ లో ఎమ్మెల్యే కుమారుడిపై కేసు నమోదు


విజయవాడలో ఆదివారం చోటుచేసుకున్న కారు ప్రమాదంలో నగరానికి చెందిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు పుత్రరత్నం బోండా సిద్దూపై పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్ధూతో పాటు శ్రీరాములు అనే విద్యార్థిపైనా కేసు నమోదు చేసినట్లు విజయవాడ పోలీసులు తెలిపారు. కారు రేసింగ్ లో భాగంగా సిద్ధూ మితిమీరిన వేగంతో కారును నడిపిన కారణంగానే ప్రమాదం సంభవించిందని... ఇంజినీరింగ్ విద్యార్థి నాగేంద్ర చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సిద్ధూతో పాటు శ్రీరాములుపై సెక్షన్ 304ఏ కింద కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News