: జూడాలపై ఆరు నెలల నిషేధం: టీ సర్కారు యోచన
డిమాండ్ల సాధన కోసం రోజుల తరబడి సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లపై కఠిన చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. డిమాండ్ల సాధన పేరిట రోజుల తరబడి విధులకు గైర్హాజరవుతూ వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడేలా వ్యవహరిస్తున్న జూడాలపై ఇక ఎంతమాత్రం మృదువుగా వ్యవహరించరాదని కూడా కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సమ్మె పేరిట విధులకు డుమ్మా కొట్టిన జూడాలకు ఉపకార వేతనాలను నిలుపుదల చేయడంతో పాటు ఆరు నెలల పాటు నిషేధం విధించాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులను సంప్రదించి, జూడాలపై తీసుకునే చర్యలకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునేందుకు వేగంగా పావులు కదుపుతోంది.