: బెజవాడ కనకదుర్గ ఆలయానికి నిలిచిన రాకపోకలు
అల్పపీడన ద్రోణి ప్రభావంతో భారీగా కురుస్తున్న వర్షాలతో విజయవాడ నగరం అతలాకుతలం అవుతోంది. సిటీలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో, బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ అధికారులు అలర్ట్ అయ్యారు. కొండ చరియలు విరిగి పడే అవకాశం ఉండటంతో... గుడికి వెళ్లే ఘాట్ రోడ్డును తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో, గుడికి రాకపోకలు నిలిచిపోయాయి.