: హిల్లరీ క్లింటన్ ఆరోగ్యంగా, చిరంజీవిగా ఉండాలి: మోదీ
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి, అగ్రరాజ్య విదేశాంగ శాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్ కు భారత ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హిల్లరీ ఆరోగ్యంగా, చిరంజీవిగా ఉండాలని అభిలషించారు. 1947 అక్టోబర్ 26న జన్మించిన హిల్లరీ 67వ పడిలోకి అడుగిడారు. గత నెల అమెరికాలో పర్యటించిన మోదీ... హిల్లరీ దంపతులతో దాదాపు 45 నిమిషాల సేపు చర్చలు జరిపారు.