: శ్రీశైలంలో మళ్లీ విద్యుదుత్పత్తిని ప్రారంభించిన టీఎస్ సర్కార్
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి వివాదం కొనసాగుతూనే ఉంది. గత రెండు రోజుల నుంచి విద్యుత్ కు డిమాండ్ తగ్గిందన్న కారణంతో ఉత్పత్తిని నిలిపివేసిన తెలంగాణ సర్కార్ మళ్లీ ఉత్పత్తిని ప్రారంభించింది. విద్యుత్ కు డిమాండ్ మళ్లీ పెరిగిందని ఉద్యోగులు చెబుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 14 వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. డ్యాం ఇన్ ఫ్లో కూడా 14 వేల క్యూసెక్కులుగానే ఉంది. డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 856 అడుగుల మేర నీళ్లు ఉన్నాయి.