: కేసీఆర్ ఒక ఉగ్రవాది: ఏపీ మంత్రి రావెల


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నీవు ఒకటంటే...నేను రెండు అంటా అన్న రీతిలో ఈ విమర్శ, ప్రతి విమర్శల పర్వం కొనసాగుతోంది. మొన్న రాత్రి తమ అధినేత చంద్రబాబుపై టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు తప్పుబట్టారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి... బజారు వ్యక్తిలా మాట్లాడారని విమర్శించారు. అంతేకాకుండా, కేసీఆర్ ను ఒక ఉగ్రవాది, బజారు రౌడీ, గూండా అంటూ పరుష పదజాలంతో దూషించారు. చంద్రబాబును విమర్శించడం మానేసి... కేసీఆర్ తన పని తాను చూసుకుంటే... ఆయనకే మేలని హితవు పలికారు.

  • Loading...

More Telugu News