: నేడు వెల్లడి కానున్న ముగ్గురు నల్ల కుబేరుల పేర్లు


అక్రమంగా సంపాదించిన సొమ్మును స్విస్ బ్యాంకుల్లో దాచుకుని నల్ల కుబేరులుగా పేరుగాంచిన వారిలో ముగ్గురి పేర్లు నేడు వెల్లడి కానున్నాయి. ఈ మేరకు సదరు పేపర్లను సుప్రీంకోర్టులో దాఖలు చేయనున్న అదనపు అఫిడవిట్ లో కేంద్రం వెల్లడించనుంది. అయితే వీరు ఇప్పటికే మనకు తెలిసిన వారే అయి ఉండవచ్చన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. పేర్ల వెల్లడికి నిబంధనలు అడ్డు వస్తున్నాయని చెబుతూ వస్తున్న కేంద్రం, ఇప్పటికే అక్రమ సంపాదనకు సంబంధించి కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తుల పేర్ల వెల్లడికి ఎలాంటి అడ్డంకి లేదని తెలుసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ పేర్లు వెల్లడి కానున్నాయి. అయితే కేంద్రం వెల్లడించనున్న పేర్లపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News