: స్వచ్ఛ భారత్ లో పాల్గొన్న నలుగురు అక్కినేని హీరోలు
ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్ ను శుభ్రం చేశారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ ఇచ్చిన పిలుపు మేరకు ఆయన ఈ ఛాలెంజ్ ను స్వీకరించి అన్నపూర్ణ స్టూడియోస్ లో చెత్తను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త, వెటరన్ హీరోయిన్ అమల, యువహీరో నాగచైతన్య, అఖిల్, సుశాంత్ పాల్గొన్నారు. వారితో పాటు ఇతర కుటుంబ సభ్యులు, అన్నపూర్ణ స్టూడియోస్ సిబ్బంది, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అనిల్ అంబానీని స్వచ్ఛ భారత్ లో పాల్గోవాల్సిందిగా ప్రధాని సూచించిన సంగతి తెలిసిందే.