: 'తేనేటి విందు'ను కూడా మోడీ వాడుకున్నారు
ప్రధాని నరేంద్ర మోడీ 'తేనేటి విందు'ను కూడా భారతదేశాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకు వినియోగించుకున్నారు. బీజేపీ, ఎన్డీయే మిత్ర పక్షాల ఎంపీలకు తేనీటి విందునిచ్చిన మోడీ 'స్వచ్ఛ భారత్'లో ఎంపీలంతా పాల్గోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఎంపీ 5 గ్రామాలను దత్తత తీసుకుని ఆదర్శ గ్రామాలుగా తీర్చి దిద్దాలని సూచించారు. తేనీటి విందు సందర్భంగా ప్రధాని ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన పధకాలు, వాటి పనితీరుపై సమీక్ష నిర్వహించారని టీడీపీ ఎంపీ మురళీమోహన్ తెలిపారు. స్వచ్ఛ భారత్ ను ఏర్పాటు చేసేందుకు ప్రతి ఎంపీ కృషి చేయాలని ఆయన సూచించారన్నారు. ప్రతి ఎంపీ స్వచ్ఛభారత్ ను ఆచరించి ఆదర్శంగా నిలిస్తే దేశం పరిశుభ్ర భారత్ గా అవతరించడం అసాధ్యం కాదని అన్నారని మురళీ మోహన్ వివరించారు.