: విజయాన్ని కూడా ఆస్వాదించలేకపోతున్నా: షారూఖ్
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తన కొత్త సినిమా 'హ్యాపీ న్యూ ఇయర్' విజయాన్ని కూడా ఆస్వాదించలేకపోతున్నానని తెలిపారు. తాను జలుబు, జ్వరంతో బాధపడుతున్నానని అభిమానులకు ట్విట్టర్ ద్వారా తెలిపారు. జలుబు కారణంగా వాసన తెలియడం లేదు. కనీసం చదవలేకపోతున్నానని షారూఖ్ ట్వీట్ చేశారు. హ్యాపీ న్యూ ఇయర్ సినిమాను ఆదరించిన ప్రేక్షకులు, అభిమానులకు ధన్యవాదాలని షారూఖ్ తెలిపారు.