: సర్వర్లను చైనా నుంచి అమెరికా, సింగపూర్ తరలిస్తున్నాం... డేటా తీసుకోవడం లేదు: జియోమీ వివరణ


భారత దేశంలో ప్రస్తుతం వివాదం రాజుకున్న జియోమీ ఫోన్ల క్లౌడ్ డేటా సర్వర్ పై వేడివేడిగా చర్చ జరుగుతోంది. భారత్ ను అన్ని రకాలుగా దిగ్బంధనం చేస్తున్న చైనా జియోమీ మొబైల్ అమ్మకాల ద్వారా భారతీయుల డేటాను చోరీ చేస్తోందంటూ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంస్థ తమ ఉద్యోగులెవరూ జియోమీ ఫోన్లు వాడకూడదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో వివాదం మరింత రాజుకుంది. తమ అనుమతి లేకుండా డేటా క్లౌడ్ సాఫ్ట్ వేర్ ద్వారా ప్రాధమిక సమాచారాన్ని తస్కరించి చైనాకు చేరవేస్తుందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో నాలుగు దఫాలుగా జరిగిన జియోమీ అమ్మకాలు రికార్డులు సాధించగా, ఐదో దఫా అమ్మకాలపై భారతీయులు ఆసక్తి చూపడంలేదు. దీంతో జియోమీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము క్లౌడ్ డేటా సాఫ్ట్ వేర్ ద్వారా భారతీయుల డేటా సేకరించడం లేదని, తప్పు జరిగిందని తెలుసుకోగానే దానిని సరిదిద్దుకున్నామని, అప్ డేట్ అని అడిగితే ఓకే చేసిన వినియోగదారుల సమాచారం మాత్రమే తమ దగ్గర ఉందని తెలిపింది. భారతీయుల అనుమానాలు పరిష్కరించేందుకు త్వరలోనే భారతీయ అధికారులను కలుస్తామని, ఈ వార్తలపై వివరణ ఇస్తామని స్పష్టం చేసింది. అభ్యంతరాలపై తగిన సమాచారం ఇస్తామని వెల్లడించింది. అలాగే కంపెనీ బ్రాండ్ వాల్యూను దెబ్బతీసే వార్తలను ఖండిస్తున్నామని పేర్కొంది. చైనా నుంచి తమ సర్వర్లను అమెరికాలోని కాలిఫోర్నియా, సింగపూర్ లకు తరలిస్తామని జియోమీ ప్రకటనలో వివరించింది.

  • Loading...

More Telugu News