: అరేబియా సముద్రంలో తీవ్ర వాయుగుండం!


అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ముంబైకి పశ్చిమ నైరుతి దిశలో 1270 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీవ్ర వాయుగుండం ఉత్తర గుజరాత్ తీరంవైపు తరలివెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వాయుగుండం నుంచి కర్ణాటక మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. వీటి కారణంగా రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, కోస్తాంధ్రలో చెదురుమదురు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

  • Loading...

More Telugu News