: ప్రకాశం జిల్లాలో మావోయిస్టుల డంప్... రూ.60 లక్షల నగదు లభ్యం!
ప్రకాశం జిల్లాలో ఆదివారం మావోయిస్టులకు చెందిన ఓ భారీ డంప్ లభ్యమైంది. జిల్లాలోని రాచర్ల మండలం ఆకివీడు వద్ద బయటపడ్డ ఈ డంప్ లో ఆయుధాలతో పాటు రూ. 60 లక్షల మేర నగదు బయటపడింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని రహస్య ప్రదేశానికి తరలించిన పోలీసులు మరిన్ని వివరాలు రాటబ్టేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. మావోయిస్టుల డంప్ లో ఆయుధాలు పెద్ద ఎత్తున లభిస్తున్నప్పటికీ భారీ మొత్తంలో నగదు దొరకడం అరుదు. ఈ క్రమంలోనే ఆదివారం దొరికిన డంప్ లో రూ.60 లక్షలుండటంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.