: ఏపీపై పోరుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కసరత్తు షురూ!
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద విద్యుదుత్పత్తి విషయంలో ఏపీతో నెలకొన్న వివాదంపై ఎలా నెగ్గుకురావాలనే విషయంపై తెలంగాణ సీఎం కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు ఆయన ఆదివారం రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, ఇతర సీనియర్ అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. విద్యుదుత్పత్తిపై ఏపీ చేస్తున్న వాదనను ఎలా ఎదుర్కోవాలి? ఏపీపై సుప్రీంకోర్టులో దాఖలు చేయాల్సిన పిటిషన్ రూపకల్పనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అనే విషయాలపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం. అంతేకాక ఈ నెల 29న జరగనున్న కృష్ణా నదీ జలాల బోర్డు ముందు ఏ విధమైన వాదన వినిపించాలన్న విషయంపైనా వారు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.