: మగమహారాజులకు తలంటిన ఢిల్లీ న్యాయస్థానం
పెళ్లప్పుడు రాజభోగాలతో ఊరేగుతారు. తలకు మించిన ఖర్చు చేసి రాకుమారుడిలా ఫోజులు కొడతారు. అదే పెళ్లి పెటాకులైతే విడాకులు పొందిన భార్యకు, పిల్లలకు భరణం చెల్లించండి అంటే మాత్రం పేద ఏడుపులు ఏడుస్తారని ఢిల్లీలోని ఓ న్యాయస్థానం మగమహారాజులకు తలంటింది. ఓ విడాకుల కేసు విచారణ సందర్భంగా భార్యకు, చదువుకుంటున్న పిల్లలకు చెల్లించాల్సిన మెయింటెనెన్స్ ఖర్చును న్యాయస్థానం 3 వేల రూపాయల నుంచి 5 వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.