: గవర్నర్ కు వాస్తవాలను నివేదించా: ఏపీ మంత్రి దేవినేని ఉమ


శ్రీశైలం ప్రాజెక్టు వద్ద తెలంగాణ సర్కారు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్న విద్యుదుత్పత్తికి సంబంధించిన వాస్తవాలను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు వివరించినట్లు ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ఆదివారం రాజ్ భవన్ లో గవర్నర్ కలిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. తాగు, సాగు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటిదాకా ఎన్నడూ నిబంధనలను అతిక్రమించి విద్యుదుత్పాదన చేపట్టలేదని ఆయన తెలిపారు. విద్యుత్ కావాలంటే, ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉందని, అదే ప్రాజెక్టుల్లోని నీరు కిందకెళ్లిపోతే తిరిగి రాబట్టుకోలేమని అన్నారు. రైతు ప్రయోజనాల దృష్ట్యా తక్షణమే తెలంగాణ సర్కారు విద్యుదుత్పత్తిని నిలిపేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరినట్లు ఆయన తెలిపారు. ఈ విషయంపై తెలంగాణ సీఎంతో మాట్లాడతానని గవర్నర్ తెలిపారని ఉమ చెప్పారు.

  • Loading...

More Telugu News