: తెలంగాణ సర్కారుపై గవర్నర్ కు ఏపీ మంత్రి ఉమ ఫిర్యాదు
శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోతున్నా లెక్క చేయకుండా విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్న తెలంగాణ సర్కారు తీరుపై ఏపీ ప్రభుత్వం గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. ఆదివారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ రాజ్ భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ సర్కారు వైఖరిపై ఉమ, గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ సర్కారు తమ విజ్ఞప్తులను పెడచెవిన పెడుతూ, నీటి మట్టం ఆందోళనకర స్థాయికి పడిపోతున్నా, విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్న తీరును ఆయన గవర్నర్ కు వివరించారు. తక్షణమే తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తిని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన గవర్నర్ ను కోరారు.