: ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు...పలు ప్రాంతాల్లో పోటెత్తిన వాగులు


అల్ప పీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్ర్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో శనివారం సాయంత్రం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వాగులు పొంగిపొరలుతున్నాయి. కర్నూలు జిల్లా బనగానపల్లెలో వర్షం కారణంగా పాలేరు వాగు ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో ఓ లారీ వాగు ప్రవాహంలో కొట్టుకుపోయింది. కర్నూలు నగర సమీపంలోనూ భారీ వర్షం కారణంగా వాగులు పొంగి పొరలుతున్నాయి. జిల్లాలోని ఎగువ ప్రాంతాల నుంచి సుంకేసులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో సుంకేసుల బ్యారేజీ రెండు గేట్లను ఎత్తేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ప్రకాశం జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది. అద్దంకి సమీపంలోని చిన్న కొత్తపల్లి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇతర గ్రామాలతో ఆ గ్రామానికి సంబంధాలు తెగిపోయాయి. తెలంగాణలోని జిల్లాల్లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది.

  • Loading...

More Telugu News