: విమానాన్ని దింపినా అతని ప్రాణం నిలబడలేదు
విమానాన్ని అత్యవసరంగా దించినప్పటికీ ప్రయాణికుడి ప్రాణం కాపాడలేకపోయిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. కోల్ కతా నుంచి బెంగళూరు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో అశోక్ ఛటర్జీ అనే ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. దీంతో హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించగా, మార్గ మధ్యంలోనే ఆయన మృతి చెందారు.