: ఏపీ, తెలంగాణ సమన్వయ కమిటీని నియమించిన బాబు


అటు కేంద్ర ప్రభుత్వంతో వ్యవహారాలు చక్కబెట్టేందుకు... ఇటు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ఏడుగురు సభ్యుల కమిటీని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు. హైదరాబాదులో జరిగిన ఏపీ ఎంపీల భేటీలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ కో ఆర్డినేటర్ గా టీడీపీ ఎంపీ సుజనా చౌదరిని నియమించారు. కమిటీలో సభ్యులుగా కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, తోట నరసింహం, కంభంపాటి రామ్మోహనరావు, మల్లారెడ్డి, బీజేపీ ఎంపీలు బండారు దత్తాత్రేయ, కంభంపాటి హరిబాబు ఉంటారు. వీరు విభజన బిల్లులో కేంద్రం పేర్కొన్న ప్రకారం, నిధులు రాష్ట్రాలకు రప్పించడంలో సమన్వయంతో పని చేయనున్నారు.

  • Loading...

More Telugu News