: వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో బాంబు కలకలం
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో బాంబు కలకలం రేగింది. ఆలయంలో బాంబు అమర్చినట్టు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావడంతో, అందరిలోనూ ఆందోళన నెలకొంది. దీంతో, పోలీసులకు సమాచారం అందించారు. భక్తులందరినీ బయటికి పంపించివేశారు. కాకినాడ నుంచి వచ్చిన బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టాయి. ఫోన్ కాల్ ఎవరు చేశారన్న విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. శనివారం కావడంతో ఆలయం భక్తులతో రద్దీగా ఉంది. ప్రస్తుతం గుడి లోపలికి ఎవరినీ అనుమతించడంలేదు.