: ఏపీ హోం మంత్రి కాన్వాయ్ లో కారు బోల్తా, ఎనిమిది మందికి గాయాలు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కాన్వాయ్ లోని ఓ వాహనం బోల్తా కొట్టింది. దీంతో సదరు వాహనంలోని ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శనివారం కడప జిల్లా పర్యటనకు వచ్చిన హోం మంత్రి చినరాజప్ప, అక్కడి స్థానిక విలేకరులతో మాట్లాడిన తర్వాత తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మంత్రి కాన్వాయ్ చాపాడు వద్దకు చేరుకోగానే కాన్వాయ్ లోని ఓ కారు బోల్తా పడింది. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.