: మమ్మల్ని ఓడించేందుకు...బీజేపీ నకిలీ ఓట్లను సృష్టిస్తోంది: అరవింద్ కేజ్రీవాల్


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించేందుకు బీజేపీ నానా తంటాలు పడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ క్రమంలో అడ్డదారులు తొక్కుతున్న బీజేపీ, నకిలీ ఓట్లను సృష్టించేందుకు వెనుకాడడం లేదని ఆయన శనివారం పేర్కొన్నారు. నకిలీ ఓటు కోసం రూ.1,500 చెల్లించేందుకు సిద్ధపడ్డ ఆ పార్టీ , ప్రత్యర్థి పార్టీ ఓటును తొలగించినందుకు రూ.200 లను చెల్లిస్తోందని ఆయన ఆరోపించారు. బీజేపీ నేతల ఒత్తిడికి తలొగ్గి, వారు చెప్పినట్లు పనిచేసిన ఓ అధికారి ద్వారా తమకు ఈ మేరకు సమాచారం చేరిందని ఆయన వెల్లడించారు. ప్రతి నియోజకర్గంలో కనీసం 5 వేల నకిలీ ఓట్లను కొత్తగా చేర్చడంతో పాటు అంతే మొత్తంలో ప్రత్యర్థి ఓట్లను తొలగించాలని బీజేపీ అగ్ర నేతలు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారని కూడా కేజ్రీవాల్ ఆరోపించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి సోమవారం ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News