: జయకు జైలుతో జగన్ భయపడుతున్నారు: ఏపీ హోం మంత్రి చినరాజప్ప
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష పడిన నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో భయం మొదలైందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. శనివారం కడప జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుపై కేసీఆర్ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రూ.66 కోట్ల మేర అక్రమ సంపాదనకే జయకు నాలుగేళ్ల జైలు, రూ.100 కోట్ల జరిమానా పడిన వైనాన్ని ప్రస్తావించిన చినరాజప్ప, వేల కోట్ల రూపాయలు సంపాదించిన జగన్ కు కూడా శిక్ష తప్పదని చెప్పారు. జయకు జైలు శిక్ష నేపథ్యంలో జగన్ లోనూ భయం నానాటికీ పెరిగిపోతోందని ఆయన వ్యాఖ్యానించారు.