: యువీ ఫేవరెట్ కెప్టెన్ ధోనీ కాదట!
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత టీమిండియాలోకి వస్తూ పోతూ ఉన్న డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ జాతీయ మీడియాతో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సమర్థవంతంగా రాణిస్తున్నాడని, జట్టు సాధించిన ఎన్నో విజయాల్లో అతనిది కీలక పాత్ర అని అన్నాడు. అయితే, తనకిష్టమైన కెప్టెన్ మాత్రం గంగూలీయేనని ఈ పంజాబ్ యోధుడు చెప్పుకొచ్చాడు. అతని నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపాడు. దాదా సారథ్యంలోనే తన కెరీర్ వికసించిందన్నాడు. విదేశీ గడ్డపై కూడా గెలవగలమన్న నమ్మకం జట్టులో పాదుకొనడానికి గంగూలీయే కారణమన్నాడు. ఇక, టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్ స్టెన్ ను కూడా యువీ ప్రశంసల వర్షంలో ముంచెత్తాడు. గ్యారీ హయాంలో తాను బాగా రాణించానని, అతనో గొప్ప కోచ్ అని కితాబిచ్చాడు.