: పాక్ కు తిరిగివచ్చి రాజకీయాల్లో చేరాలనుకుంటున్న మలాలా


పాకిస్థాన్ యువ హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మలాలా యూసుఫ్ జాయ్ స్వదేశానికి తిరిగి వెళ్లాలనుకుంటోంది. ఈ మేరకు పాక్ పీటీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన తను పైవిధంగా అభిప్రాయపడింది. నోబెల్ బహుమతి పొందిన తరువాత తొలిసారి ఆమె మాట్లాడుతూ, పాక్ లోని స్వాత్ వ్యాలీకి తిరిగి వెళ్లిపోవాలని, రాజకీయాల్లో చేరాలనుకుంటున్నానని వెల్లడించింది. కాగా, భారత్-పాక్ దేశాలు తమ విభేదాలను పక్కనబెట్టి బాలల విద్యపై దృష్టి పెట్టాలని మలాలా విజ్ఞప్తి చేసింది. ఇదే సమయంలో డిసెంబర్ లో జరగనున్న నోబెల్ శాంతి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో ఇరు దేశాల ప్రధానమంత్రులు పాల్గొనాలని మరోసారి ఆహ్వానించింది.

  • Loading...

More Telugu News